పుంగనూరులో పౌష్టికాహారం పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కోనేటిపాళ్యెంలో గల అంగన్‌వాడీ కేంద్రంలో కౌన్సిలర్లు గంగులమ్మ, త్యాగరాజు గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని గురువారం పంపిణీ చేశారు. త్యాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తల్లిబిడ్డ క్షేమంగా ఉండేందుకు నాణ్యమైన పొషక పదార్థాలను ప్రతినెల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా అంగన్‌వాడీల్లో మెను ను ఏర్పాటు చేసి, మహిళలు, పిల్లల సంక్షేమానికి అగ్రపీఠ వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంగన్‌ వాడి సిబ్బంది ప్రేమకుమారి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Distribution of nutritious food in Punganur

Post Midle
Natyam ad