పుంగనూరులో మహిళలకు పౌష్ఠికాహారం పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

మహిళలు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు ప్రభుత్వం పౌష్ఠికాహారాన్ని పంపిణీ చేస్తోందని కౌన్సిలర్‌ పూలత్యాగరాజు అన్నారు. శనివారం తన వార్డులోని అంగన్‌వాడీ కేంద్రంలో గర్భవతులకు, బాలింతలకు పౌష్ఠికహారాన్ని పంపిణీ చేశారు. త్యాగారాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు అంగన్‌వాడీల ద్వారా పౌష్ఠికాహారాన్ని పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. అలాగే అంగన్‌వాడీలలో మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టి, ఎప్పటికప్పుడు నాణ్యమైన భోజనం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకురాలు ప్రేమకుమారి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Distribution of nutritious food to women in Punganur

Leave A Reply

Your email address will not be published.