నెలాఖరులో వేరుశనగ విత్తనాల పంపిణీ

Date:07/05/2020

రామసముద్రం ముచ్చట్లు:

వేరుశెనగ విత్తనాల ధర ఖరారైన వెంటనే ఈ నెలాఖరులోగా పంపిణీ చేస్తామని పుంగనూరు వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మీ నాయక్ తెలిపారు. మండలంలోని రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయాధికారి మోహన్ కుమార్ తో కలసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా కేంద్రాలకు నెల ఆఖరి లోపు పెయింటింగ్, విద్యుత్, నీరు, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంటాయన్నారు.గ్రామ వ్యవసాయ, పశు సంవర్థక సహాయకులు ఈ కేంద్రాలనుండే విధులు నిర్వహిస్తారని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రైతు భరోసా కేంద్రాలు సిద్దం

Tags: Distribution of peanut seeds at the end of the month

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *