పుంగనూరులో వేరుశెనగ విత్తనాలు పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని రైతులందరికి సబ్సిడి వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని సింగిరిగుంట ఆర్‌బికెలో వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేశారు. అలాగే కుమ్మరగుంటలో సర్పంచ్ మునస్వామి, వైఎస్సార్సీపి నాయకులు దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి పంపిణీ చేశారు. అలాగే పాళ్యెంపల్లె ఆర్‌బికెలో సర్పంచ్ సరోజమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్, బాబు వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేశారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో 23 పంచాయతీలోని రైతులకు వేరుశెనగ విత్తనాలను సకాలంలో అందజేశామన్నారు. అలాగే రైతులకు అవసరమైన ఎరువులు, మందులు ఆర్‌బికెల ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రైతులు అవసరమైన సలహాలు, సూచనలు ఆర్‌బికెలలో పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags: Distribution of Peanut Seeds in Punganur
