Natyam ad

పుంగనూరులో వేకువజాము నుంచి పెన్షన్లు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో వేకువజాము నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కమిషనర్‌ నరసింహాప్రసాద్‌రెడ్డి, చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. గురువారం చైర్మన్‌ అలీమ్‌బాషా, వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, అర్షద్‌అలి, పూలత్యాగరాజు, కిజర్‌ఖాన్‌, నరసింహులు, రేష్మా, కమలమ్మ, పద్మావతి భారతి, జయభారతి, నటరాజ, మమతారాణి, నయింతాజ్‌, సాజిదాబేగం, ఆదిలక్ష్మీ లు తమ వార్డులలో పెన్షన్ల పంపిణీ చేశారు. ఆలాగే ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి మంగళం గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రానికి 99 శాతం పెన్షన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించారు.ఈ కార్యక్రమంలో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Distribution of pensions from early morning in Punganur

Post Midle