Natyam ad

పుంగనూరులో వేకువజాము నుంచి పెన్షన్లు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని 31వ వార్డులలోని పెన్షన్‌దారులకు వేకువజాము నుంచి పెన్షన్‌ పంపిణీ కార్యక్రమాన్ని వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులు చేపట్టారు. శుక్రవారం చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అలాగే మండలంలోని మంగళం, కంగానెల్లూరు గ్రామాలలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్లు పంపిణీ చేపట్టారు. మండలంలోని రాంపల్లె వద్ద గల డయాలసిస్‌ సెంటర్‌లో పెన్షన్‌దారు సిరాజుద్దీన్‌కు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ లలిత, వైఎస్సార్‌సీపీ నాయకుడు మధుసూదన్‌రెడ్డి పెన్షన్‌ అందించారు. అలాగే యూబికాంపౌండులో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, రహమత్‌నగర్‌, నానబాలవీధిలో జిల్లా మైనార్టీ సెల్‌ కార్యదర్శులు ఇంతియాజ్‌, మహబూబ్‌బాషా, కౌన్సిలర్లు అర్షద్‌అలీ, నరసింహులు, కిజర్‌ఖాన్‌, రేష్మా, రెడ్డెమ్మ, కాళిదాసు, కమలమ్మ, జయభారతి, సాజిదాబేగం, భారతి, ఆదిలక్ష్మీ, పద్మావతి లు పెన్షన్లను వారి వారి వార్డులలో పంపిణీ చేశారు.

Post Midle

Tags: Distribution of pensions from early morning in Punganur

Post Midle