పుంగనూరులో వేకువజాము నుంచి పెన్షన్లు పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని వివిధ ప్రాంతాలలో సోమవారం వేకువజాము నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్ నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా పలు వార్డులకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. అలాగే రహమత్‌నగర్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే మండలంలోని మంగళం గ్రామంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ మున్సిపాలిటిలో అర్హులైన పేదలందరికి పెన్షన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. సచివాలయాల ద్వారా అర్హులకు అన్ని సంక్షేమ పథకాలు అందించి, నూతన పరిపాలనకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కొనియాడారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వైస్‌చైర్మన్లు సిఆర్.లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు త్యాగరాజు, అమ్ము, కిజర్‌ఖాన్, అర్షద్‌అలి, నయీంతాజ్, రేష్మా, జయభారతి, సాజిదా, యువకుమారి, కాళిదాసు, కమలమ్మ తదితరులు ఆయా వార్డుల్లో పంపిణీ చేశారు.

Tags: Distribution of pensions from early morning in Punganur
