పుంగనూరులో ఇంటింటా పెన్షన్లు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

 

పెన్షన్‌దారులను ఉదయం లేపి పెన్షన్‌ పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పట్టణంలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ, చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో పెన్షన్లు పంపిణీ చేశారు. అలాగే మండలంలో ఎంపీడీవో రాజేశ్వరి, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్లు పంపిణీ చేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటి పరిధిలో 4,775 మంది లభ్ధిదారులకు రూ.1.15 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, మాజీ చైర్మన్‌ నాగభూషణం, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, పార్టీ నాయకులు రాజేష్‌, రమణ, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Distribution of pensions throughout the house in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *