పెన్షన్ దారులకు ప్రోసెడింగ్ ల పంపిణి

Date:20/07/2019

సిద్దిపేట ముచ్చట్లు:

సిద్దిపేట జిల్లా  గజ్వేల్లో  పెన్షన్ దారులకు పెంచిన పెన్షన్ ప్రోసెడింగ్ లపంపిణీ కార్యక్రమం జరిగింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ,సిద్దిపేట,మెదక్ జెడ్పి చైర్మన్లు,జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి , గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.  వికలాంగులకు మూడు వేల పదహారు, వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులకు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం కేవలం మన తెలంగాణలో తప్ప దేశంలోనే ఎక్కడా లేదన్నారు.

 

 

 

 

 

ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన మన ముఖ్యమంత్రి కెసిఆర్ కు  కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అండదండగా ఉండే పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ పార్టీ చేయనటువంటి అభివృద్ధి పనులు టిఆర్ఎస్ చేస్తుందన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.   అదే విధంగా ప్రతి గ్రామంలో సర్పంచి మరియు సంబందిత అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఈ ఉత్తర్వులు పంపిణీ చేయాలని సూచించారు.

సీఎం పర్యటనకు ఏర్పాట్లు

Tags: Distribution of Proceedings to Pensioners

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *