పుంగనూరులో రంజాన్ తోఫా పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణ మాజీ సర్పంచ్, దివగంత అబ్ధుల్‌రహీమ్‌సాహెబ్ స్మారకార్థం ఆయన కుమారుడు బిఏఆర్.మహమ్మదాలి 1500 మందికి రంజాన్‌తోఫా పంపిణీ చేశారు. గురువారం ఎన్‌ఎస్.పేట, ఎంబిటిరోడ్డు, కుమ్మరవీధి, కొత్తపేట ప్రాంతాల్లో సుమారు రూ.12 లక్షలు విలువ చేసే సరుకులు పంపిణీ చేశారు. కాగా గత ఇరవై సంవత్సరాలుగా మహమ్మదాలి ఈ కార్యమ్రాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే పట్టణంలోని సుమారు 1200 మందికి ప్రతినెల రూ.2 వేలు చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఎంఎం.ఆనంద, కరీముల్లా, గౌస్‌బాషాలు నిర్వహించారు.

Tags; Distribution of Ramzan Tofa in Punganur
