Natyam ad

పుంగనూరులో ముస్లింలకు రంజాన్‌తోఫా పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని వాహిద్‌వెల్ఫేర్‌ ఎడ్యూకేషనల్‌ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 150 మంది ముస్లిం కుటుంభాలకు ఆదివారం రంజాన్‌ తోఫా పంపిణీ చేశారు. ట్రస్ట్ సభ్యులు హఫీజ్‌, అబ్ధుల్‌అలీమ్‌, మహమ్మద్‌ఏజాస్‌ లు కలసి ఒకొక్క కుటుంభానికి రూ.750 లు విలువ చేసే వస్తువులు పంపిణీ చేశారు. గత 8 సంవత్సరాలుగా ట్రస్ట్ వారు పేదలకు రంజాన్‌ మాసంలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈకార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఇబ్రహింసాహెబ్‌, ఎస్‌కెపి.ఖాజా, సలీం, మహమ్మద్‌ఫైరోజ్‌, షపివుల్లాఖాన్‌ , రియాజ్‌అహమ్మద్‌అలి, సజ్జాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Distribution of Ramzan Tofa to Muslims in Punganur

Post Midle