మృతుల కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణి

Date:08/08/2020

దర్శి  ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం లోని కురిచేడు  లో  ఇటీవల శానీటైజర్ త్రాగి   మృతి చెందిన కుటుంబాలను స్థానిక పంచాయతీ కార్యాలయం ప్రక్కన గల భవనంలో కేర్ ఇండియా ఇంటర్నేషనల్ వారు 14 కుటుంబాలకు బియ్యం,  నిత్యావసర సరుకుల ను శనివారం పంపిణీ చేశారు.      ఈ కార్యక్రమంలో  ముఖ్య అతిథిగా హాజరైన  కురిచేడు యస్.ఐ     జి. రామిరెడ్డి మాట్లాడుతూ కేర్ ఇండియా వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప పరిణామం అని అలాగే నిరుపేదలు మత్తు కోసం శానిటైజర్ కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకొవద్దని కోరారు. కేర్ ఇండియా జిల్లా ప్రతినిధి అరుణ్ కుమార్ మాట్లాడుతూ మా సంస్థ ద్వారా జిల్లా లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అలాగే తాగునీటి సౌకర్యం అనాధలకు పింఛన్లు పంపిణీ అనాధ పిల్లలకు విద్య నoదించడం విపత్కర పరిస్థితుల్లో వారికి సహాయం చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

 

 

 

ఈ కార్యక్రమంలో కేర్ ఇండియా ఫౌండర్ పి. వి. జాన్,  డైరెక్టర్ బాబి జాన్,   కురిచేడు లీడర్ జే. రవికుమార్,   జక్కరయ్య,  ప్రభుదాస్, జెడ్పిటీసీ అభ్యర్థి నుసుం నాగిరెడ్డి, . యంపిటీసి కానాల శివారెడ్డి, బుల్లం వెంకట నర్సయ్య, వైసీపీ నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నుసుం నాగిరెడ్డి, పడమర వీరాయి పాలెం సొసైటీ బ్యాంకు అధ్యక్షులు ఊట్ల వెంకటేశ్వర్లు, .కోలా సంతోష్ కుమార్, మహమ్మద్ జానీ., కంభంపాటి కోటయ్య., కిరణ్ బాబు, .మీడియా కో ఆర్డినేటర్ కర్ణాటి రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సుమారు 100 మంది శిక్షణార్థులకు కరోనా పాజిటివ్.

Tags: Distribution of rice and essential commodities to the families of the deceased

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *