శ్రీ సాయిరాం వృద్ధుల ఆశ్రమానికి బియ్యం కూరగాయలు వితరణ

నెల్లూరు ముచ్చట్లు :
ఏఐ.వై.ఎఫ్ అద్వర్యంలో గూడూరులోని శ్రీ సాయిరాం వృద్దుల ఆశ్రమానికి బియ్యం కూరగాయలు నిత్యావసర వస్తువులు శుక్రవారం పంపిణి చేయడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ ఆశ్రమ నిర్వాహకులు ప్రభుత్వం లేదా దాతల నుండి సరైన సహకారం అందని కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటువంటి సందర్భాలలో మనసున్న దాతలు ఆయా ప్రాంతాలలోని ఆశ్రమాల స్థితిగతులు తెలుసుకొని వృద్ధులకు, వికలాంగులకు, అనాధలకు చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో తమ వంతు సహకార చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమం లో ఏ.ఐ.ఎస్.ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.శశి కుమార్ ఏఐ.వై.ఎఫ్ జిల్లా కన్వినర్ సునీల్ యాదాల ,ఏఐ.వై.ఎఫ్ పట్టణ కార్యదర్శి చల్లా .వెంకటేశ్వర్లు ,ఏఐ.వై.ఎఫ్ నాయకులు వెంకటేష్ .రాజా .శరత్ .మల్లి తడితురులు పాల్గొన్నారు.

 

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags:Distribution of rice and vegetables to Sri Sairam Old Age Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *