పోలీస్‌స్టేషన్‌లో పేదలకు బియ్యం పంపిణీ

Distribution of rice to the poor in police station

Distribution of rice to the poor in police station

– ఎస్‌ఐ హరిప్రసాద్‌ స్పెషల్‌
– పలువురి ప్రశంసలు

Date:20/05/2018

వరదయ్యపాళ్యెం ముచ్చట్లు :

పోలీసులు రమ్మంటున్నారంటు పోలీసులు జీపులో ఇంటి వద్దకు వెళ్లే సరికి పేదలు హడలిపోయారు. ఏం జరుగుతోందో అర్థం కాక తల్లడిల్లిపోయారు. 30 మందిని పోలీస్‌స్టేషన్‌కు రమ్మని హుకుం జారీ చేశారు.పేదలు కలసి స్టేషన్‌ చేరుకున్నారు. యూనిఫాంలో ఉన్న ఎస్‌ఐ హరిప్రసాద్‌ పేదలకు నమస్కరించి అప్యాయంగా లోనికి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరికి బార్య, బిడ్డలతో కలసి ఎస్‌ఐ హరిప్రసాద్‌ బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. పేదలకు ఆశ్చర్యం కలిగించే సంఘటన చిత్తూరు జిల్లా, వరదయ్యపాళ్యెం పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. ఎస్‌ఐ హరిప్రసాద్‌ తాత అద్దెన్న వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఎలాంటి ఆస్థిపాస్తులు లేని నిరాశ్రయులైన పేదలకు ఆకలి తీర్చేందుకు తన వంతు సహాయం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు 30 కుటుంబాల వారికి ఒకొక్కరికి 25 కేజిల బస్తాల బియ్యంను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ హరిప్రసాద్‌, ఆయన సతీమణి వనజ , పిల్లలు యశశ్విని, తేజవర్ధన్‌ కలసి స్వయంగా పాల్గొని పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సంఘటనతో నిశ్చేష్ఠులైన పేదలకు నోటమాట రాలేదు. ఎందుకో….అర్ధంకాకుండ ఉండిపోయారు. పోలీసులంటే తినేవారే అనుకున్నాం….మాకు పెట్టేవారు ఉన్నారా….అని ఆనందం వ్యక్తం చేస్తూ ఎస్‌ఐ కుటుంబం చల్లగా ఉండాలంటు దీవెనలిస్తూ బియ్యం తీసుకెళ్లారు. పేదలకు బియ్యం పంపిణీ చేయడంతో పోలీస్‌ అధికారులతో పాటు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags: Distribution of rice to the poor in police station

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *