ప్రాత కోట లో ఘనంగా రథోత్సవం..

-ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా తిరునాళ్ల మహోత్సవం

-భారీ పోలీస్ బందోబస్తు

Date:15/01/2021

పగిడ్యాల  ముచ్చట్లు:

పగిడ్యాల మండలం లోని పడమర ప్రాత కోట గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తిరుణాల మహోత్సవం నిర్వహించారు. 8వ తేదీ నుండి ప్రారంభమైన పూజ ఉత్సవ కార్యక్రమాలు. మూడు రోజులు పూజలు అందుకున్న దేవత మూర్తులకు. శుక్రవారం  సాయంత్రం 6 గంటల నుండి రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రథోత్సవ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నందికొట్కూరు శాసనసభ్యులు ఆర్థర్. నంద్యాల పార్లమెంట్ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి. నందికొట్కూర్ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. శ్రీ నందీశ్వర. కాశీ ఈశ్వర  స్వామివారికి ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు విచ్చేసిన పెద్దలకు ఆలయ పురోహితులు ప్రత్యేక  హారతులతో స్వాగతం పలికారు. వివిధ గ్రామాల నుండి వివిధ జిల్లాల నుండి విచ్చేసిన భక్త జన సందోహం మధ్య శ్రీ అన్నపూర్ణ సామెత. శ్రీ విఘ్నేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం  బాజాభజంత్రీలు మేళతాళాలతొ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఎన్నో సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న నందీశ్వర  కాశీ ఈశ్వర తిరునాళ్ల మహోత్సవన్ని పెద్దల కాలం నుండి పాతకోట గ్రామంలో తిరుణాల జరపడం ఆనవాయితీగా వస్తుందని గ్రామ  దేవాలయ కమిటీ పెద్దలు అన్నారు. అదే విధముగా ఈరోజు బండలాగుడు పోటీలకు 12 జతల పాల బండ కోడేలు బండలాగుడు పోటీలో పాల్గొన్నాయి.

 

 

 

క్రికెట్ పోటీలు. నిర్వహించారు. శుక్రవారం రాత్రి జానపద సంస్కృతిక కార్యక్రమాలు. భక్తాదులకు కనువిందు కలిగించాయి.ప్రాతకోట గ్రామ పెద్దలు పార్టీలకతీతంగా అన్ని పార్టీల నాయకులు. కుల మతాల పెద్దలు. ప్రజల సహాయ సహకారాలతో ఒకే తాటిపైకి వచ్చి శ్రీ నందీశ్వర. శ్రీ కాశీ శ్వర. శ్రీఅన్నపూర్ణ. శ్రీవిగ్నేశ్వర స్వామి వార్ల తిరునాళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహించడం హర్షించదగ్గ విషయమని వివిధ గ్రామాలలోని ప్రజలు నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా నందికొట్కూరు రూరల్ సిఐ ప్రసాద్. అర్బన్ సీఐ నాగరాజారావు. ప్రోద్బలంతో ముచ్చుమర్రి ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు. నందికొట్కూరు ఎస్ఐ వెంకట్ రెడ్డి.

 

 

 

జూపాడుబంగ్లా ఎస్ఐ. తిరుపాలు. మిడుతూరు ఎస్ఐ గోపీనాథ్. పాములపాడు ఎస్ఐ రాజ్ కుమార్ సారథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రాతకోట గ్రామం లో రథోత్సవ కార్యక్రమాన్ని . చిన్న సమస్య లేకుండా ముందుకు నడిపించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమేష్ నాయుడు. ఎర్రం వెంకట్ రెడ్డి. బీరవోలు వెంకటేశ్వర్లు. సగినేల రమణ. మసీదుల సుభాన్. గట్టన్న కొడుకు వెంకటేశ్వర్లు. విద్యా కమిటీ చైర్మన్ శిలార్ సాహెబ్. అంబటి శివ శంకర్ రెడ్డి. పుట్టా రమణ ప్రసాద్. డాక్టర్ నాగ శేషులు. కుర్వ మల్లయ్య. రఘువీరారెడ్డి. శ్రీధర్. గజ్జేల నాగేశ్వర్రెడ్డి. పుల్లారెడ్డి. గుర్రెడ్డి. నారాయణ. సురేంద్ర. పక్కీరయ్య. పల్లె బక్కన్న. వివిధ జిల్లాలో గ్రామాల నుండి విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు.

సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి

Tags: Distribution of Sanitary Napkins to several women in Katrapally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *