Natyam ad

రబి సీజన్కు విత్తనాల పంపిణీ, ఖరీఫ్ పంట నష్టం చెల్లించాలి

– కౌలు రైతులకు ఎకరాకు 30 వేల పంట నష్టం 5 లక్ష రుణమాఫీఇవ్వాలి

నందికొట్కూర్ ముచ్చట్లు:

నందికొట్కూర్, నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రైతన్నలకు తక్షణమే శనగ విత్తనాలు పంపిణీ చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు పి వెంకటేశ్వర్లు , బెస్త రాజు డిమాండ్ చేశారు.
సోమవారం స్థానిక సుందరయ్య భవన్లో రైతు సంఘం నాయకుల సమావేశం రామ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతు ఖరీఫ్ సీజన్లో రైతుల వేసిన మొక్కజొన్న, మిరప ,ఉల్లి ,పత్తి తదితర పంటలు అరకుర  వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయన్నారు. రైతులు పంట సాగుకు  అప్పులు చేసి పంట వేసి నష్టపోవడం జరిగిందన్నారు,  రైతులకు రబి సీజన్  విత్తనాలను అదును సమయంలో ప్రభుత్వం సబ్సిడ్ శనగ విత్తనాలు పంపిణీ చేయాలని డిమాండ్చేశారు.కాబట్టి తక్షణమే అధికారులు  స్పందించి రైతులకు శనిగ,  పొద్దుతిరుగుడు ,తెల్ల శనిగలు, పంపిణీ చేసి  మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు, ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయిన రైతు కౌలు రైతులకు ఎకరాకు రూ 30 వేల  నష్ట పరిహారం ఇవ్వాలన్నారు , కౌలు రైతులకు రూ 5లక్షలు లోపు ఉన్నవారికి రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు, రైతన్నలకు తక్షణమే శనగ విత్తనాలు పంపిణీ చేయని యెడల నందికొట్కూరు నియోజకవర్గం లోని రైతుల సమీకరించి ఏడీఏ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని  హెచ్చరించారు ,ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పీపకీర్ సాహెబ్, గోపాల్,సంపంగి వెంకటేశ్వర్లు, రైతులు నారాయణ, మధు నాయుడు, కృష్ణయ్య, మహిళా సంఘం నాయకులు ఎస్ బి బి, తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Distribution of seeds for Rabi season and payment of Kharif crop loss

Post Midle

Leave A Reply

Your email address will not be published.