కుట్టు మిషన్లు, పరికరాలు పంపిణి

Distribution of sewing machines, equipment

Distribution of sewing machines, equipment

Date:24/11/2018
ఏలూరు ముచ్చట్లు:
సమాజంలో సగం భాగం మహిళలు.  వారు అన్ని రంగంల్లో అభివృధ్ధి చెందాలని, రాష్ట్రముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రధాన్యతను ఇచ్చి,ప్రోత్సహం అందింస్తున్నారని అన్నరు.  రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖమంత్రి పితాని  సత్యనారాయణ అన్నారు. శనివారం నాడు అయన అచంటలో కార్యాలయం వద్ద కుట్టుమిషన్లు, ఆదరణ-2 పథకం క్రింద వాషింగ్  మిషన్లు, జిగ్ జాగ్ మిషన్లు,  మహిళలకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలకు, చేతి వృత్తులు వారికి రాష్ట్ర ప్రభుత్వం  మంచి సబ్సిడీలు వివిధ రకాల, కులవృత్తుల పనిముట్లను అందింస్తుంది అని అన్నారు.  ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అన్నారు. ప్రతి పేదకుటుంబం నెలకు రూ.10 వేలకు ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది అని మంత్రి అన్నారు.
మహిళల ఆలోచనలు, ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అన్నారు. సంక్షేమం, అభివృదిలో  మహిళలు భాగస్వాములు అయి చురుకైన పాత్ర పోషించాలని మంత్రి  అన్నారు. ఈ రోజు కుట్టుమిషన్లు, జిగ్ జగ్ మిషన్లు ఇస్తున్నాం ఆధునిక డిజైన్లులో మంచి శిక్షణ కూడ ప్రభుత్వం ఇస్తుంది ప్రతి ఒక్క మహిళ శిక్షణ పొంది, మంచి ఉపాధి ఆవకాశాలను పెంచుకోవాలని మంత్రి అన్నారు. తన ఇంట్లో పిల్లలకు కుట్టుకుని బయటవారికి సంబందించిన బట్టలు కుట్టుకొని మంచి ఆదాయం పొందాలని పిల్లలను మంచి చదువులు చదివించుకోవాలని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేదల అందరికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం స్థలాలు ఉ్నవారికి గృహ నిర్మణానికి ఆర్థిక సాయం అందిస్తున్నామని ,ప్రభుత్వ స్థలాలు లేని చోట ప్రవేటు స్థలాలు కొనుగోలు చేసి కార్పొరేట్ స్ధయిలో ఇల్లు నిర్మాణాలు చేసి
నిరుపేదలకు అందించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వేగ వంతంగా గృహనిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు. నాకు పిన్షన్ రాలేదని నాకు రేషన్ కార్డు రాలేదని,  అనే పిర్యాదులు లేదని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కార్యిక,ఉపాధి కల్పనాశాఖ మంత్రి పితాని,సత్యనారాయణ అన్నారు. కుట్టుమిషన్లు జిగ్ జాగ్ మిషన్లు వాషింగ్ మిషన్లును మంత్రి పితాని సత్యనారాయణ లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎ.యం.సి. చైర్మన్,సురేష్ బాబు, గోపాలకృష్ణ, జట్.పి.టి.సి. బండి కామారావు, మేకల పద్మకుమారి  ప్రసాద్, సంగాని వెంకటేశ్వరావు ,మానెపల్లి సత్యనారాయణ ,వివిధ గ్రామాల మాజీ సర్పంచ్ లు గ్రామాల నాయకులు వివిధ శాఖాల అధికారులు పాల్గోన్నారు.
Tags:Distribution of sewing machines, equipment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *