Natyam ad

తుక్కుగూడ మున్సిపాలిటీలో గొర్రెల పంపిణీ

రంగారెడ్డి ముచ్చట్లు;

మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని 6,7,8 వార్డులో పల్లు అభివృధి పనులకు మంత్రి సిబితా ఇంద్రారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేసారు. స్ట్రీట్ లైట్ ను ప్రారంభించారు. మంఖాల్ లో గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కులాని వర్గాన్ని ఎన్నుకొని ఎవరు ఏ పని చేసుకుంటున్నారు వారి కుటుంబానికి అసరా చేసుకుంటారని ఆలోచించి కుటుంబ సర్వే చేయించ్చారని అన్నారు. 28 లక్షల మందిలో 12 లక్షల మంది వివిధ రకాల పశువులు గొర్రెలు సాగుతున్నారని అన్నారు. గొర్రెల బీమా అనే పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. యాదవులు అందరూ గొర్రెల పెంచుకుంటారు. కాబట్టి వాళ్లకు ప్రభుత్వపరంగా ఎంతోకొంత సాయం చేయాలని మొదటి విడతలు 3 లక్షల మందికి గొర్రెలు ఇవ్వడం జరిగిందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మిగిలిన వారికి కూడా గొర్రెలను ఇవ్వాలని రెండో విడత గొర్రెల పంపిణీ మొదలుపెట్టడం జరిగిందని అన్నారు మన రాష్ట్రంలో మాంసం ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి అయ్యేదాని తెలంగాణలో సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత మాంసం ఉత్పత్తి బాగా పెరిగిందని అన్నారు
ఈ కార్యక్రమంలో చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ కమిషనర్, ఎంఆర్ఓ, పశుసంవర్ధక శాఖ అధికారులు, బి ఆర్ ఎస్ నాయకులు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post Midle

Tags:Distribution of Sheep in Tukkuguda Municipality

Post Midle