విద్యార్థులకు కందిపప్పు పంపిణీ

పత్తికొండ ముచ్చట్లు :

 

పట్టణంలోని ఎంపీడిఓ కార్యాలయం సమీపంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ( సెంట్రల్ )లో చదువుతున్న విద్యార్థులకు కందిపప్పును పంపిణీ చేశామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై చెన్నకేశవరావు చెప్పారు మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మండల విద్యాధికారి రంగస్వామి ఆదేశాల మేరకు జగనన్న గోరుముద్ద పథకం కింద పాఠశాల కమిటీ చైర్మన్ సుభాన్బి ఆధ్వర్యంలో లో హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులకు కందిపప్పు ప్యాకెట్లు ఇచ్చామన్నారు పాఠశాలలో 205 మంది విద్యార్థులు ఉండగా 160 మంది విద్యార్థులకు పంపిణీ చేశామని చెప్పారు మరో 45 మంది విద్యార్థులకు బుధవారం అందజేస్తామన్నారు ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 4.5 కేజీల కందిపప్పు ప్యాకెట్ ను ఇచ్చామన్నారు హాజరు కాని విద్యార్థులకు బుధవారం ఉదయం 10 గంటలకు అందజేస్తామన్నారు కరోనా నేపథ్యంలో కందిపప్పు ఇవ్వడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు కందిపప్పు ప్యాకెట్లను తీసుకుంటూ సీఎం పట్ల మహిళలు ఆనందంతో హర్షం వ్యక్తం చేశారన్నారు. సమావేశంలో పాఠశాల ఉపాద్యాయురాలు కస్తూరి పాల్గొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Distribution of soybeans to students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *