రాయితీఫై ఛాప్ కట్టర్స్ పంపిణీ
చౌడేపల్లె ముచ్చట్లు:
పాడిరైతులకు రాయితీపై గడ్డి కత్తరించే యంత్రాలను ఛాఫ్ కట్టర్స్ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, జెడ్పిటీసీ సభ్యుడు ఎన్. దామోదరరాజు శక్రవారం రైతులకు పంపిణీ చేశారు. మండలానికి 12 చాఫ్ కట్టర్స్ మంజూరైనట్లు డాక్టర్ పవన్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వం రైతులకు సౌలభ్యంగా జొన్న గడ్డి,ను చిన్న చిన్న ముక్కలుగా కత్తరించి తేలికగా జీర్ణమయ్యే లాగా వెహోక్క జొన్న గడ్డిను కట్ చేసుకొనే వీలుందని తెలిపారు.చాఫ్ కట్టర్ ధర రూ:33,970 కాగా సబ్సిడీ ధర రూ:13,588 పోగా రైతు రూ:20382 చెల్లించాల్సి ఉందన్నారు. ఆసక్తిగల రైతులు సంబంధిత పశువైధ్యశాలలో సంప్రదించాలని సూచించారు. వీటి వలన 50శాతం పైకా కాండం లావుగా ఉన్నందు వలన మేతని పూర్తిగా పశువులు వినియోగించుకోలేవు. ఈ యంత్రం ద్వారా చిన్న , చిన్న ముక్కలుగా చేయడం ద్వారా మేతను వృధా ను అరికట్ట వచ్చునన్నారు. ఇలాంటి మేత పశువులు తినడం వలన 10 శాతం పాల దిగుబడి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరక్టర్ రమేష్‌బాబు, కాగతి చిన్నప్ప, శంకర్‌రెడ్డి, రెడ్డిప్రసాద్ తదితరులున్నారు.
Tags: Distribution of subsidized chop cutters

