Natyam ad

9న మంత్రి పెద్దిరెడ్డిచే ఆసరా చెక్కులు పంపిణీ

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్‌ ఆసరా చెక్కులను మహిళలకు శుక్రవారం అందజేస్తారని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి తో కలసి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అలాగే మున్సిపాలిటిలో చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి ఉదయం 9 గంటలకు మార్కెట్‌ కమిటిలో మండలంలోని మహిళలకు చెక్కులు పంపిణీ చేస్తారని, మున్సిపల్‌ కార్యాలయంలో పట్టణ మహిళలకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పాల్గొని మంత్రి సభను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు చెంగారెడ్డి, సచివాలయాల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, రమణ, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Distribution of support checks by Minister Peddireddy on 9

Post Midle