క్రీడాకారులకు టి షర్టులు పంపిణి
తిరుపతి ముచ్చట్లు:
జాతీయ మహిళా, పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటిలలో భాగంగా బుధవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ ఆవరణములోని లలిత కళా ప్రాంగణములో తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా టి షర్టు ల పంపిణి కార్యక్రమము జరిగినది.ఈ సందర్భముగా ఏర్పాటు చేసిన కార్యక్రమములో తిరుపతి శాసనసభ్యులు మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 9 వరకు తిరుపతిలో ప్రతిష్టాత్మకముగా నిర్వహిస్తున్న జాతీయ కబడ్డీ పోటిల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చెసిన క్రీడాకారులు, టిమ్ మేనేజర్లు, కోచ్ లకు ఈ సందర్భముగా టి షర్టు లు, ఐ.డి.కార్డు లు అందజేసారు. నగరపాలక సంస్థ మేయర్ డా. ఆర్ . శిరీషా మాట్లాడుతూ ఈ పోటిల లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు చేపట్టామన్నారు. అర్జున్ అవార్డ్ గ్రహీత హోన్నప్ప గౌడ్ ప్రసంగింస్తూ పోటిలో పాల్గొనే క్రీడాకారులు క్రమశిక్షణతో మెలగాలన్నారు. కమీషనర్ పి.యస్. గిరిషా మాట్లాడుతూ క్రీడాకారులు కోవిడ్ నిబoధనలు పాటిస్తూ ఇందుకు అవసరమైన శానిటైజర్లు, మాస్క్ లు అందించామన్నారు.ఈ కార్యక్రమములో డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, అభినయ్ రెడ్డి, అదనపు కమీషనర్ డి. హరిత, ఆంధ్ర కబడ్డీ సంఘం కార్యదర్శి శ్రీకాంత్, స్పోర్ట్స్ ఆర్గనైజర్ పెన్నా భాస్కర్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
కార్పోరేటర్ లకు, పాత్రికేయులు టి షర్టులు పంపిణి
తిరుపతి నగరపాలకసంస్థ పరిధిలోని కార్పోరేటర్లకు, పాత్రికేయులకు టి షర్టు లను ఇందిరా మైదానములో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి , మేయర్ డా. శిరీషా, కమీషనర్ పి.యస్. గిరిషా చేతుల మీదుగా అందజేసారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Distribution of T-shirts to players