త్రివర్ణ పతాకాల పంపిణీ

గాజువాక ముచ్చట్లు:

హర్‌ ఘర్ తిరంగలో భాగంగా దేశ ప్రజలు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో 65 వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు ఆధ్వర్యంలో వార్డులోని 5 సచివాలయాల పరిధిలో జెండాల పంపిణీ కార్యక్రమం జరిగింది.ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని మాట్లాడారు.రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు వీటి పంపిణీ కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టినట్లు తెలిపారు.దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా జరుగుతున్న ఈ వేడుకలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యుడు దొడ్డి రమణ,మంగునాయుడు,సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Distribution of Tricolor flags

Leave A Reply

Your email address will not be published.