Distribution of tricycles to special talents

ప్రత్యేక ప్రతిభావంతులకు ట్రై సైకిళ్లు పంపిణీ

Date:26/10/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

ప్రత్యేక ప్రతిభావంతులైన ఇద్దరికి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో మంజూరైన ట్రైసైకిళ్ల ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పంపిణీ చేశారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏఐపీపీ మెంబరు అంజిబాబు, జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, ఎంపీపీ అభ్యర్థి రామమూర్తి,మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, ఎంఈఓ కేశవరెడ్డి, ఎంపీడీఓ వెంకటరత్నంలు కలిసి చిన్నారులు గౌతమ్‌, పూజితలకు అందజేశారు. ఈ సంధర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు, వైద్యంకు అధిక ప్య్రాధాన్యత ఇస్తుంన్నదని,భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక ప్రతిభావంతులకు విద్య, సదుపాయాలు, ఫిజియోథెరఫి తదితర కార్యక్రమాల ద్వారా వారిలో నైపుణ్యంను తేవడం జరుగుతోందని గుర్తుచేశారు. ప్రభుత్వ సేవలను అర్హులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్‌ మునస్వామిరాజు, రమేష్‌రెడ్డి, నేతలు నాగరాజగౌడు,చిన్నప్ప, సనావుల్లా,తదితరులున్నారు.

రాజరాజేశ్వరీదేవి గా బోయకొండ గంగమ్మ

Tags: Distribution of tricycles to special talents

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *