టౌన్,రూరల్ పోలీస్ స్టేషన్లకు స్టార్ ఫౌండేషన్ రెండు ఆక్సిజన్ కాన్సెంటేటర్స్ వితరణ

నర్సీపట్నం ముచ్చట్లు :
సోమవారం నర్సీపట్నం  టౌన్ పోలీస్ స్టేషన్ లో స్టార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ కాన్సెంటేటర్స్ అందజేశారు.ఈ కార్యక్రమంకు స్టార్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్  హాజరై ఏ ఎస్ పి తూహిన్ సిన్హాకు  రెండు ఆక్సిజన్ కాన్సెంటేటర్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ పెద్ద బొడ్డేపల్లి ఆర్ సి ఎం 87 బ్యాచ్ సభ్యులంతా కలసి స్టార్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఎన్నో ఏళ్లుగా నర్సీపట్నం ప్రాంతంలో లో  సమాజానికి ఉపయోగపడే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు పాఠశాలలో చదువుకున్న తమ తోటి విద్యార్థులు అంతా ఇప్పటికే నర్సీపట్నం ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా పనిచేస్తున్న పోలీసులకు రెండు గ్యాస్ కాన్సెంటేటర్స్ స్టార్ ఫౌండేషన్ నుండి  ఇవ్వడం జరిగిందన్నారు.స్టార్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ బి ఎస్ ఆర్ శర్మ మాట్లాడుతూ మా మిత్రులు ఎన్ ఆర్ ఐ లు ఎస్ గంగాధర్,టి సూర్య చంద్రలు సౌజన్యం తో సేవా  కార్యక్రమలు  చేస్తున్నామన్నారు.సుమారు లక్షా పదివేలు విలువ చేసే రెండు ఆక్సిజన్ కాన్సెంటేటర్స్ టౌన్,రూరల్ పోలీస్ స్టేషన్లకు అందజేయడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో సి ఐ స్వామి నాయుడు, ఎస్ ఐ లక్ష్మణరావు, స్టార్ ఫౌండేషన్ సభ్యులు సెక్రటరీ నాగిరెడ్డి, ప్రభాకర్,వుడా రాము, దేవత కామేశ్వరరావు ,తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Distribution of two oxygen concentrators by Star Foundation to Town and Rural Police Stations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *