వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ

Date:30/10/2020

జగిత్యాల  ముచ్చట్లు:

లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్ ఏరియా మరియు వివిధ ప్రాంతాలలో రోడ్డు ప్రక్కన పండ్లు, కూరగాయలు మరియు ఇతర చిల్లర వర్తక వీధి వ్యాపారులకు గొడుగుల పంపణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల అధ్యక్షులు లయన్ మంచాల జగన్ మాట్లాడుతూ పట్టణంలో రోడ్డు ప్రక్క ప్రక్కన వ్యాపారులు ఎండ, వానలకు పడుతున్న ఇబ్బందులను గుర్తించి క్లబ్  ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు.శుక్రవారం  పదిహేను మంది వీధి వ్యాపారులకు సుమారు 18 వేల రూపాయల విలువగల గొడుగులను జిల్లా జీఎంటీ  కో ఆర్డినేటర్ లయన్ హన్మాండ్ల రాజరెడ్డి  సౌజన్యంతో పంపిణీ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో లయన్స్ క్లబ్  ఆధ్వర్యంలో అవసరార్థులకు సేవలను మరింత విస్తృతపరుస్తామని సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల అధ్యక్షులు లయన్ మంచాల జగన్, జిల్లా జీఎంటీ కోఆర్డినేటర్, లయన్ హన్మాండ్ల రాజరెడ్డి, రీజియన్ చైర్మన్ లయన్ అల్లాడి ప్రవీణ్, కార్యదర్శి లయన్ కొమ్ముల జీవన్ రెడ్డి, కోశాధికారి లయన్ గుంటుక‌ మహేష్, చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ గండ్ర దిలీప్ రావు, జిల్లా కోర్ టీం మెంబర్ లయన్ గుంటుక చంద్ర ప్రకాష్, మాజీ అధ్యక్షులు లయన్ చాప కిషోర్, ఎలిమిల్ల ఉషాకిరణ్, లయన్ పోతని ప్రవీణ్, ఉపాధ్యక్షులు లయన్ దండంరాజ్ స్వరాజ్, లయన్ పొలాస రవీందర్, లయన్ దుబాయ్ శీను, లయన్ నల్ల గంగాధర్, లయన్ ఇల్లెందుల వెంకట్రాములు, లయన్ పడాల నారాయణ గౌడ్, లయన్ మండలోజు రవీందర్, లయన్ కొమ్ముల జగపతి రెడ్డి, లయన్ గడ్డం లక్ష్మారెడ్డి, లయన్ మామిడి మణికంఠ, లయన్స్ క్లబ్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్దలతో మిలాదున్‌ నబి

Tags: Distribution of umbrellas to street vendors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *