పేద కుటుంబాలకు కూరగాయల పంపిణీ

Date:04/06/2020

గుంటూరు ముచ్చట్లు:

లాక్ డౌన్  నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు వైఎస్ఆర్ సీపీ నాయకులు గుడిపూడి సాగర్ బాబు అన్నారు గుంటూరులోని 57వ డివిజన్ పరిధిలో జన చైతన్య సమితి ఆధ్వర్యంలో లో వైఎస్ఆర్ సీపీ నాయకులు పటాన్ నూర్ ఖాన్, రిహనల సహకారంతో 300 కుటుంబాలకు కూరగాయల పంపిణీ నిర్వహించారు ఈ సందర్భంగా సాగర్ బాబు మాట్లాడుతూ కరోనా వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని శానిటైజర్ వాడుకోవాలని అన్నారు జన చైతన్య సమితి  నిర్వాహకులు దాసరి విజయ్ బెన్నీ బాబు మాట్లాడుతూ పేద కుటుంబాలకు దాతలు అందిస్తున్న సేవలు మరువలేనివని ఇంటి నుండి వచ్చేటప్పుడు మాస్కులు ధరించడం తో పాటు సామాజిక దూరాన్ని పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ బృంద ప్రతినిధులు అన్నవరపు లెనిన్ బాబు, అమర్లపూడి సునీల్ ,గుంటి సాగర్, తోట రమేష్, ప్రవీణ్, అన్నవరపు స్టాలిన్ బాబు , చిన్ని తదితరులు పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి కూరగాయలను పంపిణీ చేశారు.

రెండవ విడత వాహన మిత్ర పథకం ప్రారంభం

Tags: Distribution of Vegetables to Poor Families

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *