నేటి నుండి ఓట‌రు స్లిప్‌ల పంపిణీ – దాన‌కిషోర్‌

Distribution of voter slips from today - Danakishor

Distribution of voter slips from today - Danakishor

Date:26/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
హైద‌రాబాద్ జిల్లాలో మంగ‌ళ‌వారం నుండి ఓట‌రు స్లిప్‌ల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్టు హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ వెల్ల‌డించారు. హైద‌రాబాద్ జిల్లాలోని 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న 3,800ల‌కు పైగా పోలింగ్ కేంద్రాల ప‌రిధిలో ఉన్న బూత్ లేవ‌ల్ అధికారులు ఈ ఓట‌రు స్లిప్‌ల పంపిణీని చేప‌డుతార‌ని తెలియ‌జేశారు. నేడు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణపై నోడ‌ల్ అధికారుల‌తో స‌మీక్షస‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా దాన‌కిషోర్ మాట్లాడుతూ న‌గ‌రంలో ఓట‌రు స్లిప్‌ల పంపిణీని సోమ‌వారం నుండి చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ప్రారంభం కాలేద‌ని, సోమ‌వారం నాడు పంపిణీ చేయాల్సిన ఓట‌రు స్లిప్‌ల‌ను డిసెంబ‌ర్ 2వ తేదీన పంపిణీ చేయ‌నున్న‌ట్టు తెలియ‌జేశారు. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో రెండు పోలింగ్ కేంద్రాల‌ను మోడ‌ల్ పోలింగ్ కేంద్రాలుగా రూపొందించే ప్ర‌క్రియ‌ను వెంట‌నే ప్రారంభించాల‌ని కోరారు. హైద‌రాబాద్ జిల్లాలో 3,866 పోలింగ్ కేంద్రాల‌తో పాటు మ‌రో ఏడు అద‌న‌పు పోలింగ్ కేంద్రాల‌తో క‌లిసి 3,873 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయ‌ని తెలిపారు.
మోడల్ పోలింగ్ కేంద్రాలు ఓటర్ల‌ను ఆక‌ట్టుకునేవిధంగా ఉండ‌డంతో పాటు పండుగ వాతావ‌ర‌ణం మాదిరిగా ఉండాల‌ని సూచించారు. పోలింగ్ కేంద్రాలు ఉన్న అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లను రిట‌ర్నింగ్ అధికారులు, నోడ‌ల్ ఆఫీస‌ర్లు సంద‌ర్శించి టాయిలెట్ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డం, టాయిలెట్ సౌక‌ర్యంలేని, నీటి వ‌స‌తిలేని పోలింగ్ కేంద్రాల‌లో వెంట‌నే ఈ సౌక‌ర్యాల‌ను చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్‌లోని అన్ని స‌మ‌స్యాత్మ‌క పోలింగ్ కేంద్రాల ముందు వంద మీట‌ర్ల ప‌రిధి క‌వ‌ర్ అయ్యేవిధంగా సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు. అందరికీ అందుబాటులో ఎన్నిక‌లు అనే నినాదంతో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించినందున హైద‌రాబాద్ జిల్లాలో ఉన్న 18,000 మంది దివ్యాంగులు త‌ప్ప‌నిస‌రిగా ఓటు వేసేలా ఉచిత ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పిస్తున్నామ‌ని పేర్కొన్నారు.
ఉచిత ర‌వాణా సౌక‌ర్యాన్ని పొందాల‌నుకునే దివ్యాంగులు వాదా యాప్ ద్వారా త‌మ పోలింగ్ కేంద్రం పేరు, తాము ఓటువేసే స‌మ‌యం, త‌మ నివాస వివ‌రాల‌ను అంద‌జేస్తే ఉచిత ర‌వాణా సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. బీ.ఎల్‌.ఓల‌కు పారితోషికం విడుద‌ల‌ ఎన్నిక‌ల విధులు నిర్వ‌ర్తించే బూత్ స్థాయి అధికారులకు (బి.ఎల్‌.ఓ) గౌర‌వ పారితోషికం వెంట‌నే విడుద‌ల చేయాల‌ని హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ ఆదేశాలు జారీచేశారు. 2018 సంవ‌త్స‌రానికి సంబంధించి 3,836 బి.ఎల్‌.ఓల‌కు దాదాపు ఏడు కోట్ల రూపాయ‌ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఎన్నిక‌ల విభాగం అధికారుల‌ను ఆదేశించారు. ఈ స‌మావేశంలో అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ హ‌రిచంద‌న‌, ముషార‌ఫ్ అలీ, ర‌వికిర‌ణ్‌, విజ‌య‌ల‌క్ష్మి, చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్‌, ఎన్నిక‌ల అధికారులు పంక‌జ‌, శ‌శికిర‌ణాచారి త‌దిత‌రులు పాల్గొన్నారు.
Tags:Distribution of voter slips from today – Danakishor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *