పుంగనూరులో వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు అద్దాలు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

 

వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు అవ్వ, తాతలకు అద్దాలు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా అంధత్వ నివారణ పోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి నిర్వహించారు. బుధవారం ఆయన నియోజకవర్గ పరిధిలోని 570 మంది వృద్ధులకు అద్దాలను ఏఎన్‌ఎంల ద్వారా అందజేశారు. డాక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 60 సంవత్సరాలు పైబడిన వారికి కంటి చికిత్సలు నిర్వహించి, ఉచితంగా అద్దాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమాన్ని పకడ్భంధిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్లు డాక్టర్‌ రెడ్డికార్తీక్‌, డాక్టర్‌ సల్మా , అఫ్తాలమిస్ట్ బాబుఖాన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Distribution of YSR eye light glasses in Punganur

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *