పొలంబడి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్

ఆచంట ముచ్చట్లు:

హార్ ఘర్ తీరంగ్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా  ఆచంట మండలం శేషామ్మ చెరువు పొలంబడి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పాల్గొన్నారు. కలెక్టర్ కు మర్యాదపూర్వకంగా గ్రామ సర్పంచ్ రైతులు ఘన స్వాగతం పలికారు. తరువాత కలెక్టర్ చర్చ గోష్టి కార్యక్రమంలో  క్రింద కూర్చుని రైతుల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.  రైతులు మాట్లాడుతూ కాలువల పూడికతీత, గుర్రపు డెక్క, రబీ పంటకు  అమ్మిన ధాన్యం డబ్బులు జమ కాలేదని సమస్యలు తెలియజేశారు.. దీంతో కలెక్టర్ స్కానుకూలంగా స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు..వ్యవసాయంలో ఎన్నో మార్పులు వచ్చాయి.. రైతులకు లాభసాటిగా  ఉండే వరి వంగడాలు శాస్త్రవేత్తలు మనకు అందిస్తున్నారు.. ఎరువులు, పురుగుమందులు లేని ఆర్గానిక్ పంటల మీద రైతులు దృష్టి  సారించాలన్నారు..ఆర్బికే కేంద్రాల ద్వారా రైతులకు ప్రభుత్వం ఎన్నో సేవలు అందిస్తుంది అని  జిల్లా కలెక్టర్ తెలిపారు.

 

Tags: District Collector in Polambadi program

Leave A Reply

Your email address will not be published.