Natyam ad

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సచివాలయం మరియు ప్రాథమిక పాఠశాలలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

అనంతపురం ముచ్చట్లు:


అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మరియు శెట్టూరు మండలం ల పర్యటనలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సచివాలయం మరియు ప్రాథమిక పాఠశాలలు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తనిఖీ చేసారు. తరువాత సచివాలయ సిబ్బందికు మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు వారి యొక్క విధులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశిస్తూ సచివాల సిబ్బందికు, ఉపాధ్యాయులకు సమయకాలం సక్రమంగా పాటిస్తూ పిల్లలకు విద్యను అందించాలని నాడు నేడు పూర్తికాని పాఠశాలలలో పూర్తయ్యే విధంగా వేగవంతం చేయాలని కోరారు. సచివాల సిబ్బంది  ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ప్రభుత్వ పథకాలను ఎక్కడ అవినీతికి జరగకుండా నేరుగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు. వైద్య సిబ్బందికు ప్రజల మరియు పశువుల ఆరోగ్యాల గురించి ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా పూర్తిస్థాయిలో ఆరోగ్య సిబ్బంది పనిచేయాలని తెలిపారు.

 

Tags: District Collector inspected Primary Health Centre, Secretariat and Primary Schools

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.