ఆకస్మికంగా కోవిడ్ 19 కమాండ్ కంట్రోల్ రూమ్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Date::03/04/2020

కర్నూలు, ముచ్చట్లు:

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రాకాసి వ్యాప్తి చెందకుండా… నియంత్రణ కోసం కోవిడ్-19 లాక్ డౌన్ పై ఇంకా మరింత గట్టి నిఘా పెట్టాలని కోవిడ్ 19 కమాండ్ కంట్రోల్ అధికారులకు జిల్లా కలెక్టర్ జి.విరపాండియన్ సూచించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న  కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా జిల్లా కలెక్టరేట్ లో జిల్లా సంయుక్త సర్వోన్నత అధికారి రవి పట్టన్ షెట్టి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ 19 కమాండ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జిల్లా జాయింట్ కలెక్టర్ రవి పట్టన్ షెట్టి లు శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు దిశా నిర్దేశం చేసి మార్గదర్శకాలు ఇచ్చారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కోవిడ్ 19 ఫారెన్ రిటర్నస్ ట్యాగింగ్ సర్వే లైన్… ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలను అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ముత్తుకూరు గేట్ సెంటర్ లో 200 మంది యాచకులు, నిరాశ్రయులకు అన్నదానం

Tags:District collector who suddenly checked the Kovid 19 Command Control Room

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *