కలవరంలో జిల్లా కాంగ్రెస్ 

Date:19/05/2018
ఆదిలాబాద్‌ ముచ్చట్లు:
2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ తీసుకోబోతున్న కొత్త విధానాలు ఆ పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. ధన బలం ఉంటే చాలు ఎన్నికల్లో గెలిచేయవచ్చు అనుకునే నేతలకు కొత్త చిక్కులు మొదలు కానున్నాయి. ధన బలంతో పాటు జన బలం కూడా తప్పనిసరిగా ఉండాలనే సంకేతాలను ఆ పార్టీ అధిష్ఠానం ఇవ్వడం చర్చనీయాం శంగా మారుతోంది. జిల్లాలో ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉండ గా ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాలు పాక్షికంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రి రాంచంద్రా రెడ్డి, భార్గవ్‌ దేశ్‌పాండే, గండ్రత్‌ సుజాత ము గ్గురు నేతలు టికెట్‌ కోసం పోటీ పడుతుం డగా బోథ్‌లో జాదవ్‌ అనిల్‌, సోయం బాపూ రావ్‌ ఇద్దరు, ఖానాపూర్‌ నియోజకవర్గంలో హరినాయక్‌ ఒక్కరు మాత్రమే టికెట్‌ను ఆశించిన వారిలో ఉన్నారు. వీరితో పాటు మరికొంత మంది ఆశా వహులు కూడా కాం గ్రెస్‌ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.సాధారణ ఎన్నికలకు ఏడాది ముందే ఆ పార్టీ అధిష్ఠానం అభ్యర్థుల ఎంపికపై సీరి యస్‌గా దృష్టి సారిస్తోంది. ఈ సారి రాజ స్థాన్‌ తరహాలో టికెట్‌ల కేటాయింపు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ కొత్త విధానాన్నే తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలు స్తోంది. ఇప్పటికే జిల్లా నాయకత్వానికి సూచ న ప్రాయంగా వెల్లడించినట్లు సమాచారం. కొత్త విధానం ప్రకారం.. ఒక నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థులు వారి బయోడేటాతో పాటు నియోజకవర్గంలోని ప్ర తీ బూత్‌ నుంచి 10 నుంచి 15 మంది ఓటర్ల పేర్లు జాబితాలోని క్రమసంఖ్య, మొబైల్‌ నెంబర్‌ జత పరిచి పంపించాల్సి ఉంటుంది. నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. బూత్‌ల వారీగా గత ఎన్నికల్లో పార్టీకి పోలైన ఓట్ల వివరాలు కూడా జత చేయాలి. నియోజకవర్గానికి ఒక కమిటీని వేసి అభ్యర్థి గెలుపు జన బలంపై సర్వే చేప డతారు. ఆ తర్వాత సర్వే రిపోర్టు ఆధారం గానే అధిష్ఠానం అభ్యర్థి గెలుపు, ఓట ములపై ప్రాథమిక అంచనా వేస్తుంది. దీని అనంతరమే దరఖాస్తు చేసుకోవాలని సదరు అభ్యర్థికి అధిష్ఠానం సూచిస్తుంది.వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయా లన్న ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి నియోజ కవర్గాల వారీగా దరఖాస్తులను సేకరించను న్నారు. జూన్‌ లేదా జూలైలో ఈ ప్రక్రియను ప్రారంభించాలనే యోచనలో పార్టీ అధిష్ఠా నం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త విధానంతో ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకొని పని చేసిన వారికి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు సేవా కార్యక్రమాలతో జనా ల్లోకి దూసు కెళ్తున్నారు. అలాంటప్పుడు పార్టీ సీనియర్‌ నేతలకు గడ్డు కాలమే ఎదురు కానుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. ఈ సారి కూడా తమకే టికెట్‌ వస్తుందని గొప్పలు చెబుతున్న నేతలకు కొత్త విధానంతో తంటాలు తప్పవంటున్నారు. అధిష్ఠానం పెద్దలతో టచ్‌లో ఉంటూ పార్టీలో మారుతున్న పరిణామాలపై సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు.గత ఓటమి నుంచి గుణపాఠం నేర్వని కాంగ్రెస్‌ నేతలు గ్రూపు విభేదాలను వీడడం లేదని ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకోవడం కనిపిస్తోంది. జిల్లాలో ప్రధానంగా ఆదిలా బాద్‌ నియోజకవర్గంలో నేతల మధ్య విభే దాలు అందనంత దూరానికి చేరుకున్నాయి. గత నాలుగైదు మాసాల క్రితం గడపగడపకు కాంగ్రెస్‌ పార్టీ పేరుతో కలిసిపోయిన నేతలు ఆ తర్వాత అదే సీన్‌ కనిపిస్తోంది. దీంతో నేతల ఐక్యమత్యం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. గత కొన్నాళ్ల క్రితం వరకు బోథ్‌ నియోజకవర్గంలో కనిపించని పోటి సోయం బాపూరావ్‌ పార్టీలో చేరడంతో ఇక్కడ కూడా అవే గ్రూపు రాజకీయాలు ఉంటాయని అందరూ భావించారు. కాని సోయంబా పూరావ్‌ ఆదివాసీల ఉద్యమానికే అధిక సమ యం కేటాయించడంతో పార్టీ కార్యక్రమా లకు అంతంత మాత్రంగానే హాజరవుతు న్నా డు. దీంతో జాదవ్‌ అనిల్‌ అన్ని తానే అన్న ట్లుగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఖానాపూర్‌ నియోజకవర్గంలో హరి నాయక్‌ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పా ల్గొంటున్నా ఇటీవల ఓ మహిళా నేత ఆ పార్టీ కార్యకర్తలతో మంతనాలు జరుపుతూ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
Tags: District Congress in Kishavaram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *