Natyam ad

5 న జిల్లా బాలికల జూనియర్‌ కబడ్డీ జట్టు ఎంపిక

చౌడేపల్లె ముచ్చట్లు:
 
జిల్లా బాలికల జూనియర్‌ కబడ్డీ జట్టు ఎంపిక పోటీలను చౌడేపల్లె ఉన్నతపాఠశాల క్రీడామైదానంలో ఈనెల 5న బుధవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కెసి. మధు, పద్మావతి లు సోమవారం తెలిపారు.ఎంపికల్లో పాల్గొనే బాలికలు 65 కేజీలోపు బరువు కల్గి ఉండి,2002 ఫిబ్రవరి 1వతేది తరువాత జన్మించి ఉండాలన్నారు.ఎంపికైన క్రీడాకారులు ఈనెల 12నుంచి నాల్గురోజులపాటు ఒంగోలు లో జరుగు 48 వ ఆంధ్ర రాష్ట్రఅంతర్‌ జిల్లాల జూనియర్‌ కబడ్డీ పోటీలలో పాల్గొననున్నట్లు వారు తెలిపారు. ఆధార్‌ కార్డు వెంట తీసుకురావాలని కోరారు. మిగిలిన వివరాలకు 9440934507,9652935524 కు సంప్రదించాలని కోరారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: District Girls Junior Kabaddi Team Selection on 5th