సి హేమలత కి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.
పుంగనూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా,పుంగనూరు మండలం పుంగనూరు పురపాలక సంఘం ప్రాథమిక పాఠశాల ప్యాలస్ కాంపౌండ్ నందు ద్వితీయ శ్రేణి ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న సి. హేమలతకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గౌరవం దక్కింది. ఎంపీ రెడ్డప్ప సబ్ కలెక్టర్ పి .శ్రీనివాసులు , చిత్తూరు నగర మేయర్ అముద చేతులమీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు సి. హేమలత తన ఉద్యోగ జీవితాన్ని సంతృప్తిగా ఆస్వాదిస్తూ నిరంతరం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. హేమలతకు జిల్లాస్థాయి ఉత్తమ అవార్డు రావడం పట్ల ఉపాధ్యాయ సంఘం నేతలు ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.

Tags:District level best teacher award to C Hemalatha.
