సోమల కోవిడ్ సెంటర్ ను తనిఖీ చేసిన జిల్లావైద్యాధికారులు

Date:15/01/2021

సోమల ముచ్చట్లు:

సోమల కోవిడ్ సెషన్ సైట్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య, మదనపల్లె డివిజన్ డిప్యూటీ డి.ఎమ్.హెచ్.ఓ.డాక్టర్ లోకవర్ధన్, పుంగనూరు నియోజకవర్గ వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లతో కలసి తనిఖీ చేశారు. ఈనెల 16 వ తేదీ మొదటి దశలో సోమల ,సధుం, రొంపిచెర్ల ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న ఆరోగ్యసంరక్షకులకు కోవేశిల్డ్ వ్యాక్సిన్ పంపిణీ నేపద్యంలో పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని సోమల మరియు చౌడేపల్లి సెషన్ సైట్స్ ను ఎంపిక చేశామని, వాటిలో ఈరోజు సోమల పాయింట్ ను పరిశీలించామన్నారు. మొత్తం జిల్లాలో 29 పాయింట్స్ గుర్తించామని .ఈవ్యాక్సిన్ చేయుటకు గాను 500 కోవేశిల్డ్ (వ్యాక్సిన్ )14వతేదిన ఉదయం 11గంటల 30 నిమిషాలకు చిత్తూరు వైద్య మరియు ఆరోగ్యశాఖాదికార్యాలయంనుండి సోమల పీహెచ్ సీకి తరలించారని, 16వ తేదీన ఎంపిక చేయబడిన కేంద్రాలలో ఉదయం 9.00 గం లకు స్థానిక ప్రజాప్రతినిధులుచే వ్యాక్సిన్ కార్యాక్రమం ప్రారంభించడం జరుగుతుంది అన్నారు. ప్రతీ సెషన్ సైట్ లో 5 మంది వ్యాక్సినేషన్ అధికారులు ఉంటారు. వేచి ఉండు గది, రిజిస్ట్రేషన్ గది, టీకా వేయు గది, పరిశీలన గది ఉంటాయని తెలిపారు.16వ తేదీ టీకా తీసుకున్న వారు రెండవ మోతాదు 28 రోజుల తర్వాత తీసుకోవాలని సూచించారు. ఈవిధంగా సమాచారం లబ్ధిదారులకు ఫోన్ లో పంపడం జరుగుతుంది అన్నారు. ఈకార్యక్రమంలో సోమల వైద్యాధికారి డాక్టర్ మానస ,హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ, సి.హెచ్.ఓ.రవిచంద్రన్ సిబ్బంది పాల్గొన్నారు.

సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి

Tags: District Medical Officers inspecting the Somala Kovid Center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *