స్పందన అర్జీ కు స్పందించిన జిల్లా అధికారులు

Date:12/12/2019

మద్దికేర ముచ్చట్లు:

ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో ఇచ్చిన అర్జీకు జిల్లా అధికారులు స్పందించారు. గత సోమవారం మద్దికెర మండల పరిధిలోని పెరవలి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు 112 సైకిళ్లు పంపిణీ చేయాలని అర్జీని స్పందన కార్యక్రమంలో అందజేశారు. ఈ స్పందన కార్యక్రమంలో అందజేసిన అర్జీ కు జిల్లా అధికారులు కలెక్టర్ మరియు డి ఈ ఓ లు స్పందించి పాఠశాలకు 112 సైకిళ్లను మంజూరు చేశారు.వైసిపి నాయకులు ఆధ్వర్యంలో  పాఠశాల యందు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాకీర్ హుస్సేన్,వై సి పి నాయకులు రామలింగారెడ్డి, పి ఎం సి చైర్మన్ వన్నయ్య ,కో ఆప్టెడ్ మెంబర్ నెట్టికంటయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ స్పందనలో ఇచ్చిన దరఖాస్తు కు జిల్లా అధికారులు కలెక్టర్ , జిల్లావిద్యాధికారి,మండల విద్యాధికారి స్పందిచి సైకిలు పాఠశాలకు పంపిణీ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

 

రైతుల సమస్యలపై పవన్ కళ్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష

 

Tags:District officials who responded to the response petition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *