స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా ఎస్పి
నెల్లూరు ముచ్చట్లు:
జిల్లా ఎస్యపి విజయరావు బుధవారం నాడు స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. ఈనెల 22న జరగబోయే కానిస్టేబుల్ నియామక ప్రిలిమినరీ పరీక్షా పత్రాలు భద్రపరచే కోవూరు, కావలి లో స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. అయన అక్కడి సిసి టీవీ కెమెరాల ఏర్పాటు, పనితీరును పరిశీలించారు. కళాశాలల చుట్టుపక్కల ఏర్పాటు చేసిన భద్రతను స్వయంగా పరిశీలించారు. స్ట్రాంగ్ రూములను పరిశీలించి, కోఆర్డినేటర్స్ మరియు పోలీస్ అధికారులకు, రక్షణకు సంబంధించి పలు సూచనలు చేసారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఆర్ముడ్ గార్డ్ ను ఏర్పాటు చేసి , అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించేలా ఆదేశించారు.
Tags:District SP inspected the strong rooms

