డెంకాడ పీఎస్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ

విజయనగరం ముచ్చట్లు:

వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక,  మంగళవారం నాడు డెంకాడ పీఎస్ ను సందర్శించారు. రికార్డులు, సిడి ఫైల్స్,  స్టేషను ప్రాంగణంను పరిశీలించారు. అనంతరం, స్టేషను సిబ్బంది, మహిళా సంరక్షణ పోలీసులతో భేటీ అయి  వారి సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పాత నేరస్తులపై నిఘా పెట్టాలని, కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ  అధికారులను ఆదేశించారు.  విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ  టి త్రినాథ్, భోగాపురం సిఐ  విజయనాధ్, ఎస్ఐ   పద్మావతి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: District SP visited Denkada PS

Leave A Reply

Your email address will not be published.