జిల్లా వ్యాప్తంగా డిజిటల్ గ్రంధాలయాలు

District-wide digital libraries

District-wide digital libraries

Date:20/11/2019

ఒంగోలు ముచ్చట్లు:

జిల్లా వ్యాప్తంగా డిజిటల్ గ్రంధాలయాలు ఏర్పాటు చేయనున్నామని  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు  సురేష్ వెల్లడించారు. ప్రకాశం జిల్లా గ్రంధాలయ సంస్ధ ఆధ్వర్యంలో బుధవారం 52వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది.  రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పినిపె విశ్వరూప్ ముఖ్య అతిధిగా హాజరై వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్ధులకు  బహుమతులు అందజేశారు. తొలుత స్థానిక జిల్లా కేంద్ర గ్రంధాలయంలో తెలుగుతల్లి విగ్రహానికి రాష్ట్ర విద్యుత్, అటవి, శస్త్ర సాంకేతిక, పర్యాటణ శాఖ మంత్రి బాలినేని శ్రీనావాస రెడ్డి తో పాటు మంత్రులు విశ్వరూప్, సురేష్ పూలమాలలు వేసి ఘనంగా  నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో విద్యాశాఖ మంత్రి  సురేష్ మాట్లాడుతూ గ్రంధాలయాల  అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పుస్తక పఠనంతోనే  విజ్ఞానం పెంపొందుతుందని అక్షరాస్యత మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు. పుస్తక పఠనం, గ్రంధాలయాల ప్రాధాన్యత ప్రజలకు తెలియజేయాల్సిన  అవసరం వుందని అధికారులకు ఆయన సూచించారు.

 

 

 

 

 

 

 

గ్రంధాలయాల సేవలు ప్రజలు సద్వినియెగం చేసుకుని  విజ్ఙనం పెంపొందించుకుటూ  ప్రపంచ స్థాయికి ఎదగాలని విద్యార్ధులను కోరారు.  అన్ని మండలాలలో గ్రంధాలయాలను  అభివృద్ధి చేసి ప్రజలు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తామని ఆయన వివరించారు. స్వాతంత్ర సమర యోధుడు ఆంధ్రకేసరి  టంగుటూరి ప్రకాశం పంతులు స్వగ్రామమైన వినోదరాయుని  పాలెం ప్రజలు గ్రంధాలయం ఏర్పాటు చేయాలని కోరిక మీదట నూతనంగా గ్రంధాలయం నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. నాడు-నేడు కార్యక్రమంలో  భాగంగా  జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్ధుల సౌలభ్యం కోసం గ్రంధాలయాలు ఏర్పాటు చేయనున్నామని  మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  పోల భాస్కర్, కనిగిరి శాసన సభ్యులు బుర్రా మధుసుధన్ యాదవ్, జిల్లా సంయుక్త కలెక్టర్ -2 కె.నరేంద్ర ప్రసాద్, గ్రంధాలయం కార్యదర్శి ఎస్.మధుసూధన్ రావు, డి.ఇఓవి. సుబ్బారావు, ఆర్.ఐ.ఓ సుబ్బారావు, ఎపి.రెసిడెన్షియల్ పాఠశాలల కార్యదర్శి ఎమ్.ఆర్. ప్రసన్న కుమార్, ఒంగోలు ఎమ్.ఇ.ఓ టి కిషోర్, అధిక సంఖ్యలో విద్యార్ధినీ, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

 

రెంటికీ చెడ్డ రేవడిలా నగరాలు, పట్టణాలు

 

Tags:District-wide digital libraries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *