కమలానికి కలవరపెడుతున్న సర్వేలు

హైదరాబాద్ ముచ్చట్లు:


కాంగ్రెస్ ముక్త భారత్ బీజేపీ గత ఎనిమిదేళ్లుగా చెబుతున్న మాట.. చేస్తున్న నినాదం. ఇందు కోసం ఆ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ముందుకు సాగుతోంది. రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టు సడలేలా ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్ ను బలహీన పరిస్తే.. జాతీయ స్థాయిలో తమకు పోటీ యే ఉండదన్నది బీజేపీ బావన.  కాంగ్రెస్ మినహాయిస్తే జాతీయ స్థాయిలో బలంగా ఉన్న  పార్టీ, తమకు పోటీగా నిలిచే పార్టీ మరొకటుందన్నది కమలనాథుల నిశ్చితాభిప్రాయం. అందుకే  కాంగ్రెస్ ను బలహీనపరుస్తే   తమకు తమకు  తిరుగుండదనే భావనలో బిజెపి నాయకత్వం ఉంది. అందుకు ఆ పార్టీ  ఇటీవల పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలే తార్కాణం.  కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కాషాయదళం వ్యూహరచన చే స్తోంది.ఆ వ్యూహాలను అమలు చేస్తున్నది.

 

 

 

అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు,  మద్దతుతో  ప్రభుత్వాలను ఏర్పాటుచేసిన రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాగానీ, ఆ పార్టీని వెంటాడుతూనే ఉందనేది కూడా పరిశీలకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోయేందుకు ప్రాంతీయ పార్టీలు ఆసక్తిని కనబర్చకుండా బిజెపి కొత్త కొత్త వ్యూహాలను రచిస్తోంది. ఆ వ్యూహాల అమలులో  ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ ను దాదాపు నామమాత్రావశిష్టానికి తీసుకు వచ్చేసిందని పరిశీలకులు అంటున్నారు. అక్కడితో ఆగకుండా ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ పుంజుకోవడానికి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. అయితే ఈ వ్యూహాలు దక్షిణాదిలో అంతగా ఫలించడం లేదు. అందులోనూ ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలను ఎదురొడ్డి నిలిచి రోజు రోజుకూ బలోపేతమౌతోందన్నది ఆ పార్టీ శ్రేణులే చెబుతున్న మాట. దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్రాలలో కాంగ్రెస్ బలహీన పడినా లేదా పడినట్లు కనిపిస్తున్నా మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్న అంచనాతో బీజేపీ ఆ అవకాశం ఇవ్వకూడదన్న లక్ష్యంతోనే బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.ఇప్పటికే కర్ణాటకలో తన రాజకీయ చతురతతో కాంగ్రెస్ బీజేపీ సర్కార్ ను ఏర్పాటు చేసింది.  అనంతరం పశ్చిమ ప్రాంతాన     తమిళనాడులో బలోపేతానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ..

 

 

 

బీజీపీ లక్ష్యమైన కాంగ్రెస్ కు అక్కడ ఏ మంత పట్టు లేకపోవడంతో పెద్దగా పట్టించుకోవడం లేదు కేరళలో కూడా బీజేపీ పట్టు సాధించలేకపోయినా.. అక్కడ కాంగ్రెస్ ఏ మంత బలంగా లేదు. అందుకని ఆ రాష్ట్రం కూడా బీజేపీకి పెద్ద ప్రాధాన్యత రాష్ట్రంగా అనుకోవడం లేదు. ఇక మిగిలినవి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ. ఏపీ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ ఉనికి నామమాత్రమే. అయినా అక్కడ జనసేనానితో మైత్రి ద్వారా కొద్దో గొప్పో బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్లు కనిపిస్తుంది.అయినా ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవు కనుక బీజేపీ అక్కడ ఇప్పటికిప్పుడు బలోపేతం కాలేకపోయినా ఫరవాలేదన్న భావనతలో ఉందని అంటున్నారు. ఇక మిగిలింది తెలంగాణ. ఈ రాష్ట్రం విషయంలోనే బీజేపీ ఒకింత ఆందోళనతో ఉంది. అక్కడ పార్టీ బలోపేతమైదన్న సూచనలు ఉన్నా తాజా సర్వేల ప్రకారం అక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు దీటుగా, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉందన్న విషయం వెల్లడైంది. ఇదే బీజేపీని ఆందోళనకు గురి చేస్తున్నది. కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యానికి తెలంగాణ అడ్డుగా నిలుస్తుందన్న భావనతతో ఉన్న కమల నాథులు అందుకే తెలంగాణపై దృష్టి కేంద్రీకరించారు.

 

Tags: Disturbing surveys for Kamal

Leave A Reply

Your email address will not be published.