Divine children should be educated

దివ్యాంగ పిల్లలను విద్యావంతులను చేయాలి

Date:03/12/2019

రామసముద్రం ముచ్చట్లు:

దివ్యాంగ పిల్లలను నిర్లక్ష్యం చేయకుండా విద్యావంతులను చేయాలని ఎంపీడీవో లక్ష్మీపతి అన్నారు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మండల విద్యా వనరుల కేంద్రం లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు ఎంఈఓ హేమలత మాట్లాడుతూ మండలంలో భవిత కేంద్రంలో దివ్యంగాపిల్లలకు విద్యాభ్యాసం చాలా చక్కగా ఉందని చెప్పారు. దివ్యాంగ పిల్లల అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు . క్రమంలోస్థానిక వైయస్ఆర్ సీపీ నాయకులు భాస్కర్ గౌడ్, కేశవ రెడ్డి, రామచంద్రా రెడ్డి, కృష్ణారెడ్డి లు 12,500 రూపాయలు విలువచేసే సైకిల్ ను విరాళంగా అందజేశారు. అలాగే తిరుమల్ రెడ్డి పల్లి ఉపాధ్యాయురాలు వైదేహి మూడువేల రూపాయలు విలువచేసే ఫిజియోథెరపీ బెడ్ ను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు భాస్కర్ గౌడ్ఉపాధ్యాయ సంఘ నాయకులు అయూబ్ ఖాన్, మురళి, రమాదేవి, వైదేహి ,హేమలత, నరసింహులు, అనిల్ కుమార్, మల్లికార్జున, గుణశేఖర్, నాగ శ్రీనివాస్, ఐ ఈ ఆర్ టి ఉపాధ్యాయులు రాధిక ,మమత పాల్గొన్నారు. నేడు కార్యక్రమంలో మనబడి నాడు నేడు కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీలు ప్రముఖ పాత్ర వహించాలని ఎంపీడీవో లక్ష్మీపతి అన్నారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు నాడు నేడు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల అభివృద్ధి లో అందరినీ భాగస్వాములను చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈవో హేమలత 21 పాఠశాల పేరెంట్స్ కమిటీలు, ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.

 

ఉపాధి హామీ పథకంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష

 

Tags:Divine children should be educated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *