Natyam ad

సారే కావాలి…కారే రావాలి అంటూ దివ్యాంగుడి జన చైతన్య యాత్ర

-అభినందించిన మంత్రి వేముల

వేల్పూర్ ముచ్చట్లు:


సారే కావాలి…కారే రావాలి అంటూ మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి లింగాపూర్ తండాకు చెందిన దివ్యాంగుడు డి. మహేష్ కేసిఆర్ సర్కార్ కు మద్దతుగా మోటార్ సైకిల్ పై రాష్ట్ర వ్యాప్తంగా జన చైతన్య యాత్ర చేపట్టాడు. అందులో భాగంగా వేల్పూర్ చేరుకున్న మహేష్ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కేసిఆర్ గారికి మద్దతుగా ప్రజలను చైతన్య పరిచేందుకు మహేష్ తన వంతుగా చేస్తున్న యాత్ర గురించి తెలుసుకున్న మంత్రి ఆయన్ను అభినందించారు. కేసిఆర్ ది మానవీయ పాలన అని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు రూ.4016/- ఆసరా పెన్షన్ ఇస్తూ వారి జీవితానికి భరోసా కల్పించిన ఏకైక ప్రభుత్వం కేసిఆర్ దే అన్నారు. కేసిఆర్ గారు చేసిన మంచిని,ఆయన పాలనలో ప్రగతిని సోదరుడు మహేష్ కర పత్రాలు పంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా కేసిఆర్ కి మద్దతు కూడగట్టేందకు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం అన్నారు.

 

Post Midle

Tags; Divyangdu’s Jana Chaitanya Yatra, saying, “Sare wanta…kare ravali”

Post Midle