Natyam ad

దీపావళి బాణసంచా తయారీ కేంద్రాలు, నిల్వ చేసే గోడౌన్స్, విక్రయించే దుకాణాలకు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి ఉండాలి….

నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి…..
నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం….
దీపావళి పర్వదినాన్ని జిల్లా ప్రజలు అందరూ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలి…
నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి


నంద్యాల ముచ్చట్లు:

 


దీపావళి బాణసంచా తయారీ కేంద్రాలు, నిల్వ చేసే గోడౌన్స్, విక్రయించే దుకాణాలకు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి ఉండాలని, ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నంద్యాల జిల్లా ఎస్పీ  రఘువీర్ రెడ్డి  హెచ్చరించారు. రాబోయే దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యల గురించి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం నుండి ఒక ప్రకటనను విడుదల చేశారు.ఎస్పీ  మాట్లాడుతూ గతంలో వివిధ ప్రదేశాలలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రజల శ్రేయస్సు కొరకు బాణాసంచా తయారీ కేంద్రాలకు, నిల్వ చేసే గోడౌన్లకు, విక్రయించే దుకాణాలకు నియమ నిబంధనలు సూచించడం జరిగిందన్నారు. 
 బాణాసంచా నిల్వచేసే గూడెం నిర్వాహకులు, తయారీ, విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలన్నారు.. బాణసంచా సామాగ్రి తయారీ, నిల్వ కేంద్రాలు నివాస ప్రాంతాలకు నిర్దిష్ట దూరంలో ఉండాలన్నారు.  ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు.  వాటిలో విధులు నిర్వహించే వారికి అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవలసిన చర్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
  బాణాసంచా విక్రయ దుకాణాలు అధికారులు సూచించిన ప్రదేశంలోనే ఏర్పాటు చేసుకోవాలన్నారు. . జనావాసాలకు, హాస్పిటల్స్ కు మొదలగు వాటికి  దూరంగా బాణాసంచా విక్రయాలు జరగాలన్నారు.  . బాణాసంచా విక్రయ దుకాణాల మధ్య నిర్దిష్ట దూరం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  ప్రతీ దుకాణం వద్ద రెండు అగ్ని నిరోధక సిలెండర్లు, రెండు బకెట్ల పొడి ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.


  18 సంవత్సరాలలోపు పిల్లలను విక్రయాల పనుల్లో ఉంచుకోరాదన్నారు


జిల్లాలో బాణసంచా తయారీ, విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండి ప్రభుత్వ నియమ నిబంధలకు లోబడి  బాణసంచా విక్రయించాలన్నారు. లైసెన్సులు లేకుండా ఎవరైనా మందుగుండు సామగ్రి తయారుచేసిన, నిల్వ చేసిన, విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ  హెచ్చరించారు.
జిల్లాలోని పోలీస్ అధికారులు వారి పరిధిలో ఏర్పాటు చేసిన బాణసంచా తయారీ కేంద్రాలను, విక్రయ దుకాణాలను, నిల్వ ఉంచిన గోడములను సందర్శించి వారికి లైసెన్స్ లు ఉన్నాయా లేదా? ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తగిన భద్రత ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా?  ప్రభుత్వం సూచించిన నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసినారా లేదా? అను పలు విషయాల గురించి తనిఖీ చేయాలన్నారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను పాటించని యెడల వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని నంద్యాల  ఎస్పీ  పోలీస్ అధికారులను ఆదేశించారు.జిల్లాలో ఎక్కడైనా బాణసంచా సామగ్రి అక్రమ విక్రయాలు, నిల్వలకు సంబంధించిన సమాచారం ఉంటే డయల్ 100, 112 లేదా నంద్యాల జిల్లా పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 9154987020 కు కాల్ చేసి సమాచారం తెలియచేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు  గోప్యంగా ఉంచుతామని నంద్యాల ఎస్పీ  తెలియచేసినారు.

 

Post Midle

Tags:Diwali Firecracker manufacturing centers, storage godowns, shops selling must have government permission….

Post Midle