Natyam ad

దివాళీ షాపులు… కండిషన్స్ అప్లై

హైదరాబాద్ ముచ్చట్లు:


దీపావళి పండుగ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకువచ్చేది టపాసులు కాల్చడం. రెండేళ్ల క్రితం కరోనా కారణంగా హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టపాసుల విక్రయాలు, కాల్చడంపై కూడా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పండుగ రోజున బాణసంచా పేల్చడం లేకపోవడంతో కొంత కళ తప్పినట్లుగా కనబడింది.సంవత్సరం, ఇప్పుడు కోవిడ్ కేసులు తగ్గడం, లాక్ డౌన్, ఇతర ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో దీపావళి పండుగ ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో బాణసంచా విక్రయాలు, కాల్చడం పై షరతులు కూడా లేకపోవడంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా రిటైల్ దుకాణాల ఏర్పాటుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు .క‌రోనా కార‌ణంగా కాలుష్యం పెరిగి క‌రోనా వైరస్ వ్యాప్తి చెందే అవ‌కాశం ఉన్నందున బాణాసంచా అమ్మ‌కాలు, కాల్చ‌డంపై నిషేదం విధించాల‌ని రెండేళ్ల క్రితం దీపావళి పండుగకు ముందు న్యాయవాది ఇంద్రప్రకాశ్ హై కోర్టులో పిల్‌ వేయడంతో షాపులను మూసివేయాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో న్యాయ‌స్థానం ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో బాణాసంచా అమ్మ‌కాలు,

 

 

 

కాల్చ‌డంపై నిషేధించిన ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా జీవో 1777 జారీ చేయడంతో నగరంలో టపాసులు విక్రయించే దుకాణాలు మూత పడ్డాయి. అప్పటికే నగర వ్యాప్తంగా హోల్ సేల్, రిటైల్ అమ్మకాలు చేసే వ్యాపారులు కోట్లాది రూపాయల స్టాక్ కొనుగోలు చేసి అమ్మకాలకు అనుమతిలేకపోవడంతో ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.దీపావళి పండుగకు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండడంతో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా వ్యాపారులు రిటైల్ ఔట్ లెట్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండేళ్ళ క్రితం అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు టపాసుల విక్రయాలపై ఎలాంటి ఆంక్షలు ఉన్నాయనే విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు దుకాణాల ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడాన్ని నిర్ధారించుకుని రిటైల్ దుకాణాల ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం నగర వ్యాప్తంగా సుమారు నాలుగు వేలకు పైచిలుకు రిటైల్ దుకాణాలు ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా ఏర్పాటు చేస్తారు.

 

 

Post Midle

దీపావళి పండుగను పురస్కరించుకుని రిటైల్ దుకాణాల ఏర్పాటుకు ఫైర్, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ అనుమతులు తప్పనిసరి పొందవలసి ఉంటుంది. ఈమేరకు నగర పోలీసు ఉన్నతాధికారులు పలు మార్గదర్శకాలు విడుదల చేశారు. దుకాణాదారులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. దీపావళి సందర్భంగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేయదలచిన వ్యాపారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తు సమర్పించాల్సిన వెబ్‌సైట్లు: www.tspolice.gov.in లేక https://eservices.tspolice.gov.in/డివిజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ నుంచి ఎన్‌ఓసీ, ప్రభుత్వ స్థలంలో దుకాణం ఏర్పాటు చేసే వాళ్లు జీహెచ్‌ఎంసీ నుంచి తీసుకున్న అనుమతి పత్రం, ప్రైవేట్‌ స్థలంలో ఏర్పాటు చేసే వాళ్లు స్థల యజమానుల నుంచి ఎన్‌ఓసీ, గతంలో దుకాణాలు ఏర్పాటు చేసి ఉంటే ఆ లైసెన్స్‌ జీరాక్స్ కాపీ, పక్కా భవనంలో దుకాణం ఏర్పాటు చేస్తే పరిసర ప్రాంతంలో నివాసముంటున్న వారి నుండి ఎన్‌ఓసీ జత చేయాలి.అంతేకాకుండా దుకాణం బ్లూ ప్రింట్‌ కాపీ,

 

 

బ్యాంక్‌లో చెల్లించిన రూ. 600 లైసెన్స్‌ రుసుము ఒరిజినల్‌ రసీదు తప్పనిసరి. గతంలో కేసులు నమోదైన వారికి అనుమతులు ఇవ్వరు. అధికారులు కోరిన ఆయా పత్రాలు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే కేసులు తప్పవని, స్టాక్ సీజ్ చేయడం జరుగుతుందని పోలీసు శాఖ హెచ్చరించింది.

 

 

Tags: Diwali Shops… Conditions Apply

Post Midle

Leave A Reply

Your email address will not be published.