సీఎం పదవి పంపకానికి నిరాకరించిన డీకే శివకుమార్?
బెంగళూరు ముచ్చట్లు:
సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌కు చెరో రెండున్నరేండ్లు కర్ణాటక సీఎం పదవి ఇచ్చే ప్రతిపాదనను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెచ్చారని తెలుస్తున్నది. ఈ ప్రతిపాదనకు సిద్ధరామయ్య అంగీకరించినా డీకే శివకుమార్ మాత్రం అలా వద్దని చెప్పినట్టు సమాచారం. సోమవారం ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం అభ్యర్థులు సమావేశం కానున్నారు. పార్టీ కోసం చాలా త్యాగాలు చేశా
సీఎం పీఠం కోసం పోటీ పడుతున్న శివకుమార్ ఆదివారం తుముకూరులోని సిద్దగంగ మఠాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘చాలాసార్లు నేను పార్టీ కోసం త్యాగాలు చేసి సిద్ధరామయ్య వెంట నిలిచాను. సిద్ధరామయ్యకు నా వంతు సహకారం అందించాను’ అని పేర్కొన్నారు.
Tags: DK Sivakumar who refused to send the post of CM?

