Natyam ad

మంత్రి పెద్దిరెడ్డితో డికె శ్రీనివాస్‌ సమాలోచనలు

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పుంగనూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డితో ప్రముఖ పారిశ్రామికవేత్త డికె ఆదికేశవుల నాయుడు కుమారుడు డికె.శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిలు సమాలోచనలు జరిపారు. గత కొంతకాలంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్టు డికె.శ్రీనివాస్‌కు ఇస్తారన్న ప్రచారాలు రావడం జరిగింది. ఈసమయంలో హఠాత్తుగా మంత్రి పెద్దిరెడ్డిని డికె.శ్రీనివాస్‌ కలవడం చర్చనీయాంశమైంది. డికె.శ్రీనివాస్‌ వైఎస్సార్‌సీపీలోకి వస్తారని, తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా మంత్రి పెద్దిరెడ్డిని కలసి చర్చించుకోవడం సర్వత్ర చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీలో గుబులు ప్రారంభమైంది.

 

Post Midle

Tags: DK Srinivas talks with Minister Peddireddy

Post Midle