కోవిడ్19 నివారణ కు డిఎంహెచ్ఓ విస్తృత ప్రచారం

Date:29/10/2020

కామారెడ్డి  ముచ్చట్లు:

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్  సూచనలు మేరకు గురువారం కామారెడ్డి పట్టణంలో మాస్ మీడియా అధికారులు కోవిడ్19 నివారణకు, విస్తృతంగా ప్రచారం చేశారు  పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి చలి కాలంలో ,పండగల సందర్భంగా అధికంగా ఉండేప్రబాలే అవకాశం ఉందని , కావున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని ,అశ్రద్ధ చేయకూడదని తెలిపారు.కోవిడ్19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతీ పౌరుడు తన వంతు బాధ్యత వహించాలని తన కుటుంబ సభ్యలు అందరు జాగ్రత్తలు తీసుకోవాలి.మాస్క్ ధరించాలి, భౌతిక దూరం వ్యక్తి-వ్యక్తి కి మద్య కనీసం 2 గజాల దూరం పాటించాలి, జనం గుంపులుగా చేరకూడదు, తరుచుగా చేతులు శుభ్రపరచుకోవాలి. పిల్లలు, గర్భిణులు, వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్థులు విధుల్లోకి రాకుండా ఉండాలి. పౌష్టికాహారం, శుభ్రమైన నీరు,పరిసరాలు పరిశుభ్రత, పాటించి అంటువ్యాధులు సోకవని డీఎంహెచ్వో తెలిపారు.ఈ ప్రచారంలో డాక్టర్ సుజయత్ అలీ, డాక్టర్ హరీష్ , వి.సంజీవరెడ్డి ఎం. రాణి, జిల్లా ఆరోగ్య బోధకులు, కామారెడ్డిలో అశోక్ నగర్,ఎన్జీవోస్ కాలనీ,కాకతీయ నగర్, విద్యానగర్, స్టాండ్లలో, మున్సిపల్ రోడ్, నిజాంసాగర్ రోడ్,స్టేషన్ రోడ్, వీక్లీ మార్కెట్, వివేకానంద కాలనీ శ్రీరాంనగర్ కాలనీలో ప్రచారం చేసారు.

ఏఎస్పీ సాయి చైతన్య ఆధ్వర్యంలో మెగా రక్తదానం

Tags: DMHO wide publicity for Kovid 19 prevention

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *