బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన డిఎంహెచ్వో

ఆదిలాబాద్ ముచ్చట్లు:
 
కరోనాన థర్డ్ వేవ్ అదిలాబాద్ జిల్లాలోనూ  ప్రారంభమైందని  ప్రజలు ఈ మూడు నెలల పాటు అప్రమత్తంగా వ్యవహరిస్తూ  దాని బారిన పడకుండా జాగ్రత్త పడాలని అదిలాబాద్ డిఎంహెచ్వో డాక్టర్ నరేందర్ రాథోడ్ పిలుపునిచ్చారు.  జిల్లా కేంద్రంలోని పుట్లిబౌలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన ప్రారంభించారు.  ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన హెల్త్ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు , వయోవృద్ధులకు  కోవిడ్ బూస్టర్ డోస్ వాక్సినేషన్ టికాలను అందించారు.  ఈ సందర్భంగా డిఎంఅండ్హెచ్ఓ మాట్లాడుతూ  కరోన ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.   మాస్కులు ధరించనీదే  అస్సలు బయటకు రాకూడదు అని  సూచించారు.  భౌతిక దూరం పాటించడంతో పాటు అర్హులైన వారు బుస్టర్ డోస్ టీకాను  తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; DMHVO initiated booster dose vaccination

Natyam ad