హోదా, విభజన చట్టాలకోసం పోరాటాలు చేస్తే ఐటీ దాడులు చేయిస్తారా..

Do IT attacks if fighting for division and division laws

Do IT attacks if fighting for division and division laws

– కేంద్రంపై మంత్రి జవహర్ ధ్వజం
Date:12/10/2018
అమరావతి  ముచ్చట్లు:
ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు చేయాలని పోరాడిన నాయకులపై కేంద్రం ప్రభుత్వం అక్రమంగా ఐటీ దాడులు చేయించడం దారుణమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ ఆగ్రహించారు.ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ని మంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా తెలుగు ప్రజలు భయపడరు…లొంగిపోరాని అంతేగాగా ఆత్మగౌరం కోసం మరింత రెట్టింపుతో పనిచేస్తారన్నారు.
ఎన్నికలు దగ్గపడినప్పుడే బీజేపీ వ్యతిరేకించే పార్టీల ప్రజాప్రతినిధులపై దాడులు చేయించి మోదీ, అమిత్ షా లు చేతులు కాల్చుకుంటున్నారన్నాను.ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో టిటివి దినకరన్ పై ఐటీ దాడులు చేయించారు.ఆ ఎన్నికల్లో బీజేపీ కి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. ఐటీ దాడులకు గురి అయిన దినకరన్ జయలలిత కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు.
ఇదే విధంగా ఢిల్లీలో కేజ్రీవాల్ సహచరులు,మాయావతి,డీకే శివకుమార్లపై దాడులు చేసి అధికారాన్ని కోల్పోయారని చెప్పారు.2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలన్నారు.ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి రాజ్యాంగ సంస్థలను బీజేపీ రాజకీయ ప్రయోజనాలు కోసం చేయడమంటే పారిశ్రామిక అభివృద్ధిని దెబ్బతీయటంతో పాటు ఉద్యోగ,ఉపాధి కేంద్రాలను కుంటుపరుస్తున్నారు.బలహీన వర్గాలకు చెందిన బీద మస్తాన్ రావు,,పోతుల రామారావు వ్యాపారాలు, పరిశ్రమలు నడిపి వందలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.అటువంటి సంస్థలపై ఐటీ దాడులు చేశారు.
రాష్ట్రంలో తిత్లి తుపాన్ కారణంగా అతలాకుతలం ఐతే ముఖ్యమంత్రితో పాటు అధికారులు రేయింబవళ్లు నిరంతర పర్యవేక్షలో ఉంటే సీఎం రమేష్ ఇళ్ళపై ఐటీ దాడులు చేయించడం మోదీ, అమిత్ షా కుట్ర అని పేర్కొన్నారు. అక్రమంగా సంపాదించిన గాలి జనార్ధనరెడ్డి,విజయమాల్యా, నిరావ్ మోడీ,జగన్ లపై దాడులు చేయకుండా 30 ఏళ్లు పైబడి వ్యాపారాలు చేస్తున్న వారిపై బిజెపి ఐటీ దాడులు చేయించటం దారుణం.తెలుగుదేశం పార్టీ ఎదుగుదలను తొక్కలని బీజేపీ ప్రభుత్వం చూస్తే తెలుగు ప్రజలు ఊరుకునే ప్రసక్తిలో లేరని మంత్రి జవహర్ ఘాటుగా విమర్శించారు.
Tags:Do IT attacks if fighting for division and division laws

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *